ఒంగోలు,అర్జున్ సమాచారం:
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కుకున్నాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు.* ఒంగోలు కార్పొరేషన్ ఆర్ఐ నరేంద్రను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ. లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి నరేంద్ర చిక్కాడు. * ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘ఉత్తమ అధికారి’గా మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ఇప్పుడు ఏసీబీకి చిక్కడం తీవ్ర చర్చకు దారితీసింది..
=======================